BRS Leaders Arrest: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద నిరసనకు దిగిన హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ శంషాబాద్ పీఎస్కు తరలించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అరెస్టు చేయాలని, దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా బీఆర్ఎస్ నాయకులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు అందరినీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో పోలీసుల అక్రమ అరెస్టులను సహించం అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆయనతోపాటు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలా కర్, సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు నేతలను అరెస్టు చేశారు.