ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారిని సీఎం సూచించారు. రేపు డీఎస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి.శ్రీనివాస్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
డీఎస్ మృతి పట్ల సీఎంల సంతాపం..
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని, ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.