Trending Now

Minister Nara Lokesh: లక్షలమంది జలసమాధి అయ్యేలా జగన్‌ కుట్ర: మంత్రి లోకేశ్

Minister Nara Lokesh Sensational Comments On YS Jagan: ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ కుట్ర బట్టబయలైందని మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే వరద ముంపు రావడానికి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందన్నారు. వైసీపీ కుట్రలు బయట పడకుండా ఉండేందుకు ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

‘అధికారం అండ‌తో జ‌గ‌న్.. ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్ర‌కారం.. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేసి, విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేసి, లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా సైకో జ‌గ‌న్ ప‌న్నిన కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైంది. ప్ర‌కాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాల‌నే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే.. ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుంది సైకో జగన్ ముఠా.’ అంటూ ట్వీట్ చేశారు.

Spread the love

Related News

Latest News