మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 23 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం సందర్బంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవార్లకు మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ పురపాలక సంఘం తరఫున ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో హుస్నాబాద్ పట్టణ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొంకటి నళిని దేవి,బొజు రమా దేవి, కొమటి స్వర్ణలత, పేరుక భాగ్యరెడ్డి, పున్న లావణ్య, చిత్తారి పద్మ, మ్యాదర బోయిన వేణు,మ్యాదర బోయిన శ్రీనివాస్, గోవింద రవి, దొడ్డి శ్రీనివాస్, గూళ్ళ రాజు, బొల్లి కల్పన, భూక్య సరోజన, జనగామ రత్నమాల, వల్లపు రాజు, మిరియాల రమేష్, శ్రీమతి వాలా సుప్రజా మాజీ ఎంపీపీ అకుల వెంకన్న, కో ఆప్షన్ సభ్యులు యండి అయూబ్ అయిలేని శంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, డాక్టర్ కొంకటి రవి, బొజురవీందర్, కోమటి సత్యనారాయణ, పున్న సది, బొల్లి శ్రీనివాస్, జనగామ రవీందర్రావు, ఆలయ ఛైర్మెన్ పూదరి లక్ష్మీనారాయణ, పూదరి రవీందర్, పచ్చిమట్ల శ్రీనివాస్, నాయకులు పురపాలక సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.