హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఈనెల 12వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై రిటైర్డ్ జడ్జీతో విచారణ, అలాగే ధరణి స్థానంలో కొత్త విధానంపై చర్చ, ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పథకాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మంత్రులకు ఉమ్మడి జిల్లాల బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.