Trending Now

Telangana Govt: కేంద్ర వక్ఫ్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకించిన రాష్ట్ర వక్ఫ్‌బోర్డు

Telangana Waqf Board Opposed Wakf Bill: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టసవరణ బిట్లును రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ అధ్యక్షతన సోమవారం వక్ఫ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఇతర సభ్యులు హాజరయ్యారు.

కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వ్యతిరేకిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన అప్రజాస్వామిక వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరస్కరించిన మొదటి బోర్డు తెలంగాణ వక్ఫ్ బోర్డు అని, బిల్లు తిరస్కరణకు మద్దతు ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధన్యవాదాలు తెలిపారు.

Spread the love

Related News

Latest News