Udayanidhi Stalin as Deputy CM of Tamil Nadu… Announcement soon: తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను నియమించనున్నట్లు సమాచారం అందుతోంది. 24 గంటల్లోగా ఈ మేరకు ప్రకటన వస్తుందని డీఎంకే శ్రేణులు చెబుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం యువజన సంక్షేమం, క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2022 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుమారుడిని డిప్యూటీ సీఎంను చేసి పార్టీలో మరింత ప్రాధాన్యం కల్పించాలని సీఎం స్టాలిన్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.