ప్రతిపక్షం, ఆగస్టు 21: ‘బాసింగ బలాలే’ ఫేమ్ ఈశ్వర్ సాయి, ఆయన సహనటికి సంబంధించిన వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగిన ఘటనలో తన భర్తతో పాటు సహనటి ఇద్దరి తప్పు ఉందని ఆమె పేర్కొన్నారు.
అయితే ఈశ్వర్ సాయికి విడాకులు ఇచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత ఈ విషయాన్ని ప్రజలు మర్చిపోతారని అన్నారు. ఈ వ్యవహారంలో సహనటి భవిష్యత్తును కూడా తాను ఆలోచించానని, ఆమె చేసిన తప్పును తెలుసుకుని ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఈశ్వర్ సాయి, ఆయన సహనటి ఒక ప్రైవేట్ గదిలో ఉన్న వీడియో బయటకు రావడంతో ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈశ్వర్ సాయి భార్య చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.





























