ఎం సి ఎఫ్ రాష్ట్ర నాయకులు పి శంకర్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 22: మాలల రోస్టర్ పాయింట్ సవరించాలని సెప్టెంబర్ 7 న చలో మెదక్ కలెక్టరేట్ కు తరలి రండి.ఎం సి ఎఫ్ రాష్ట్ర నాయకులు పి శంకర్ విద్య ఉద్యోగ నియామకలలో అమలు చేస్తున్న మారల రోస్టర్ పాయింట్లను సవరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న మెదక్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని మాల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర నాయకులు పి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం నాడు రామాయంపేట లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్లో చలో మెదక్ కరపత్రాలను విడుదల చేశారు. సందర్భంగా ఎం సి ఎఫ్ రాష్ట్ర నాయకులు పి .శంకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తర్వాత అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్ల వల్ల మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మల్ల రోస్టర్ పాయింట్లు 22 కేటాయించడం వల్ల జిల్లా స్థాయిలో ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదు అన్నారు. మాలల పోస్టర్ పాయింట్ ను సవరించడం ద్వారానే మాలలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రోస్టర్ పాయింట్లను 22 నుండి 12 కు సవరించాలని కోరారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సెప్టెంబర్ 7వ తేదీన మెదక్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నామని తెలిపారు. చలో మెదక్ కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం సి ఎఫ్ జిల్లా నాయకులు సిద్ధిరాములు, ఎల్లం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.





























