CM Revanth Reddy Appointment Letters for Various Post: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని శిల్పారామంలో ‘కొలువుల పండుగ’లో మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ఎల్బీస్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదన్నారు.
నిరుద్యోగులు పదేళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపించారన్నారు. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం చూడాలనే దసరాకు ముందే నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ భవిష్యత్తులో ఇంజినీర్లదే కీలక పాత్ర అన్నారు. నాటి ఇంజినీర్లు హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కట్టడాలు నిర్మించారన్నారు.