Trending Now

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. నరసన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తిని, చోడవరం నుంచి కె.ఎస్‌. ఎన్‌.ఎస్‌. రాజు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్‌ను ప్రకటించారు. 34 మందితో కూడిన లిస్ట్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. ఇప్పటికే 94 మందితో తొలి జాబితా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు దక్కింది.

రెండు జాబితాలోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లు లేవు. గురజాల టికెట్ యరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల నేతలు ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నారు. ఆశావహ అభ్యర్థుల పోటీ ఎక్కువుగా ఉన్న ఐదు నియోజకవర్గాలను హోల్డ్ లోనే ఉంచింది టీడీపీ.

అభ్యర్థుల జాబితా ఇదే..

నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి
గాజువాక – పల్లా శ్రీనివాసరావు
చోడవరం – కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు
మాడుగుల – పైలా ప్రసాద్‌
ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్‌
రాజమండ్రి రూరల్‌ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం – మిర్యాల శిరీష
కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్‌
గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్‌
గుంటూరు వెస్ట్‌ – పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్‌ – మహ్మద్‌ నజీర్‌
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు – అశోక్‌ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి – కరుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) – గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్

Spread the love

Related News

Latest News