ప్రతిపక్షం, వెబ్డెస్క్: మోడీ ప్రధాని అయ్యి ఆదానీ, అంబానీ లకే మేలు చేశారని కాంగ్రెస్ సినీయర్ నేత వీహెచ్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. పేదలకు ఎక్కువగా ఉపయోగపడే పది రూపాయల నోట్లు కూడా మార్కెట్లో కనిపించడం లేదు. దానం చేద్దాం అన్న.. పది రూపాయల నోట్లు లేవని ఆయన ఎద్దేవా చేశారు.
1969 ఉద్యమం కొత్తగూడెం ఖమ్మంలో పవార్ ప్లాంట్లో ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో అనేకమంది పాల్గొన్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సోనియా గాంధీకి 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వినతి పత్రం అందజేసి.. ఆంధ్ర పెద్దతనంలో ఉండలేం అని చెప్పామని గుర్తు చేసుకున్నారు. ఆరు గ్యారంటీ లను సోనియా గాంధీ ప్రకటించింది. తప్పక అమలు చేస్తామని స్పష్టంచేశారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో అవతరణ దినోత్సవానికి రాలేకపోతున్నారని తెలిపారు.