Form Indiramma Committees by Dussehra: దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డాటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం అన్నారు. నిరూపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని చెప్పారు. అలాగే బీసీ కులగణన ప్రక్రియపై సమగ్రంగా అధ్యయనం చేయాలని బీసీ కమిషన్కు సూచించారు.