బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
ప్రతిపక్షం, స్టేట్బ్యూరో, హైదరాబాద్, ఏప్రిల్ 10: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు రానున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక విషయాలను ఏలేటి వెల్లడించారు. 25మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ తో చేతులు కలుపుతాడని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తో కలసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్ రెడీగా ఉన్నాడడని ఆరోపించారు. ఉత్తమ్, పొంగులేటి సైతం పది మంది ఎమ్మెల్యేలతో సిద్దంగా ఉన్నారన్నారు. మహబూబ్నగర్ ఎంపీ సీటు ఓడిపోతున్నామని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్ళ వలన రేవంత్ అభద్రతా బావంలో ఉన్నారని అన్నారు. గేట్లు ఓపెన్ చేసినా.. పట్టుమని పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చులోకపోయాడని విమర్శించారు.
బై ఎలక్షన్ అంటూ వస్తే.. ప్రజలు బీజేపీ వైపే ఉంటారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12ఎంపీ సీట్లు గెలవబోతోందని జోస్యం చెప్పారు. భట్టి విక్రమార్కను సైడ్ చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. సీఎం పదవి కోసం పది మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడ్తున్నారని, భట్టి 9 శాతం బీ టాక్స్ లీక్ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారని అన్నారు. భట్టిని పక్కన పెట్టి సెకెండ్ పొజిషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని,రెండో స్థానంలోకి వస్తే.. తర్వాత మెదటి స్థానం కోసం ప్రయత్నాలు మొదలు పెడ్తున్నారని అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి దగ్గర చాలా పోలికలున్నాయన్నారు. కాంగ్రెస్ లో ఎల్లో, పింక్, గాంధీ కాంగ్రెస్ ఉన్నాయని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు.