Trending Now

HYDRA: హైడ్రా కమిషనర్‌ కీలక ప్రకటన.. ఇళ్ల కూల్చివేతలపై క్లారిటీ

Hydra Commissioner Ranganath Key Comments: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా నదికి ఇరువైపులా ప్రభుత్వం చేపట్టిన సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్నవారిని హైడ్రా తరలించడం వంటి వార్తల్లో నిజం లేదన్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రత్యేక ప్రాజెక్టు అని, దీనిని మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతోందని వివరించారు. ఇక, హైడ్రా లక్ష్యం.. ఇళ్ల కూల్చివేతలు కాదని, చెరువుల పునరుద్దరణ అని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దని రంగనాథ్ అన్నారు.

Spread the love

Related News

Latest News