CM Revanth Says Govt Will Fulfill Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం 90 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, త్వరలోనే మరో 35వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం చెప్పారు.
అనంతరం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నామన్నారు. సివిల్స్ అభ్యర్థులు వివిధ రాష్ట్రాలకు, ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని సీఎం అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని విమర్శలు చేశారు. సచివాలయంలోకి ఎవరూ రాకుండా గతంలో పోలీసు పహారా ఉండేదని గుర్తు చేశారు.