తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలి

ఉద్యమ కళాకారుల రిలే నిరాహార దీక్ష

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గ్రామగ్రామాన తిరుగుతూ పాటలు, మాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యమ కళాకారులకు 1,000 ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కళాకారులకు హెల్త్ కార్డులు, ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తమను గుర్తించి, తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీరుడు సాయిలు, కమ్మరి శేఖర్ చారి, బ్యాగరీ భూమయ్య, శ్రీశైలం గౌడ్, పోచారం శుభాష్, గజ్జడ్పల్లి బిక్షపతి, అల్లారం పాపయ్య, చంద్రశేఖర్, కే. సిద్ధు, మన్నె యాదగిరి, నవీన్ స్వామి, మురళి, సుమలత తదితర కళాకారులు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News