Kangana Ranaut Criticizes Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావం ఆరెస్సెస్‌లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనల్లో మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలుసన్నారు. అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని ఆరోపించారు.
అనంతరం తన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ విషయంపై మాట్లాడారు. ఇదొక భారీ బడ్జెట్ మూవీ అని, ఈ సినిమాను నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసన్నారు. మేకర్స్ నుంచి ఎలాంటి సపోర్టు లేదని, రిలీజ్ ఆలస్యం అవుతోందన్నారు. అందుకే నష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. అందుకే మా సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉందని ఆమె చెప్పారు.