ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 16 : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార అస్త్రాలను మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయబరేలి జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ సింగ్ కు నిర్మల్ జిల్లా నాయకులు గురువారం సాయంత్రం అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి, నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మరి గంగాధర్ నిర్మల్ జిల్లా కిసాన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లా పోతారెడ్డి తదితరులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార సామాగ్రిని అందజేశారు. వారితో కలిసి రాయ్ బరేలి లోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ గాలి తీస్తుందని భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అన్ని హామీలను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా వెంటనే అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.