ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ED అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీకి సూచిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.