Trending Now

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో అల్లు అర్జున్.. ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప సెకండ్ పార్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కి వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ను చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాసేపు ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Spread the love

Related News

Latest News