Central Released Funds to Flood Affected States: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర హోంశాఖ.. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు కేటాయించింది. ఏపీకి రూ.1,036 కోట్ల వరద సాయం ప్రకటించగా.. తెలంగాణకు రూ. 416.80 కోట్లు విడుదల చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.