ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్.. ‘హ్యాపీ తలా డే’ పోస్ట్ వైరల్

ప్రతిపక్షం, జూలై 08: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జన్మదినం సందర్భంగా ఫిఫా వరల్డ్‌కప్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రత్యేక పోస్టుతో అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో స్టార్ ఆటగాళ్లైన లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాపె, ఎర్లింగ్ హాలాండ్‌లు తలో ఏడు గోల్స్ సాధించిన ఫొటోలతో రూపొందించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ “7 గోల్స్.. తలా ఫర్ ఏ రీజన్” అనే క్యాప్షన్ జత చేసింది.

అంతేకాకుండా “హ్యాపీ తలా డే” అంటూ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిఫా వంటి అంతర్జాతీయ క్రీడా సంస్థ నుంచి ధోనీకి లభించిన ఈ ప్రత్యేక గౌరవం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధోనీకి ఉన్న అభిమాన గణం, క్రేజ్ మరోసారి చర్చనీయాంశమైంది.

ఫిఫా చేసిన ఈ పోస్టుపై అభిమానులు పెద్దఎత్తున స్పందిస్తూ “ఇదే ధోనీ రేంజ్”, “తలా క్రేజ్‌కు సరిహద్దులు లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News