600 మంది బీఆర్‌ఎస్‌ నాయకులతో హరీష్‌రావుకు దసరా శుభాకాంక్షలు

కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే: హరీష్‌రావు

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్‌ అక్టోబర్ 25: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి నాయకత్వంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పాపన్నపేట, శంకరంపేట ఆర్‌ మండలాలకు చెందిన సుమారు 600 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాయకులతో కలిసి హరీష్‌రావు నివాసానికి వెళ్లి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ నియోజకవర్గాన్ని మరోసారి బిఆర్ఎస్ ఖాతాలోకి వేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట, శంకరంపేట ఆర్‌ మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News