తిమ్మాయిపల్లికి చెందిన చల్లారం లక్ష్మి మృతి

నివాళులు అర్పించిన ఎంపీ రఘునందన రావు

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 25: నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన చల్లారం కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల మాతృమూర్తి చల్లారం లక్ష్మి (82) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు తిమ్మాయిపల్లిలోని ఆమె నివాసానికి చేరుకుని, లక్ష్మి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోధైర్యంతో ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం లక్ష్మి అంతిమయాత్రలో, అంత్యక్రియల్లో పాల్గొని ఆమెకు తుది నివాళులర్పించారు.చల్లారం కృష్ణారెడ్డి ఎంపీ రఘునందన్ రావుకు సహాధ్యాయి కావడంతో, ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుంగ కనకయ్య, చౌడుచర్ల వెంకట్రాంరెడ్డి, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని లక్ష్మికి నివాళులర్పించారు.

Spread the love

Related News

Latest News