సిద్దిపేట ధాబాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు

దాబా నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక

ప్రతిపక్షం ప్రతినిధి,సిద్ధిపేట, అక్టోబర్ 25: సిద్ధిపేట పట్టణంలోని దాబాల్లో మద్యం సేవించేందుకు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే దాబాలపై దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని కొన్ని దాబాల్లో కస్టమర్లు మద్యం సేవిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ అధికారులు స్పందించారు. దాబా నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. దాబాల్లో మద్యం సేవించేందుకు అనుమతించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ప్రతి దాబా నిర్వాహకుడు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత దాబాలపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఆదివారం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి దాబా ముందు ‘మద్యం సేవించడానికి అనుమతి లేదు’ అనే స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. నిబంధనలపై కస్టమర్లకు స్పష్టత ఉండేలా చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐ మౌనికతో పాటు కానిస్టేబుళ్లు సురేష్, కార్తీక్, స్వాతి పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News