రాజన్న కృషి ఫలితం.. డిండి ప్రాజెక్టుకు జలకళ!

*మునుగోడు రైతుల చిరకాల స్వప్నం సాకారం – డిండి ప్రాజెక్టుకు జలకళ.

*ఇది మాటల ఆశయం కాదు – పోరాటానికి ప్రతీక అన్న నేతలు.

*రైతు సంక్షేమమే రాజన్న లక్ష్యం అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు.

ప్రతిపక్షం మునుగోడు, అక్టోబర్ 25: మునుగోడు నియోజకవర్గ రైతుల చిరకాల స్వప్నమైన డిండి ప్రాజెక్టుకు జలకళ రావడం వెనుక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (రాజన్న) చేసిన నిరంతర కృషి, పోరాట ఫలితమే కారణమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.నల్గొండ జిల్లా వ్యవసాయానికి జీవనాడి అయిన డిండి ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల రైతులకు భరోసా లభిస్తుందని అన్నారు.ఇది కేవలం మాటలకే పరిమితమైన ఆశయం కాదని, రైతుల కోసం సాగిన సుదీర్ఘ పోరాటానికి ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజన్న డిండి ప్రాజెక్టు కోసం అనేక సార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని, అసెంబ్లీలో సైతం ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు.రైతు సంక్షేమమే మన రాజన్న లక్ష్యమని, భవిష్యత్తులో కూడా రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News