ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 23 : అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా 65 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం డంపును స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నగర్ కాలనీలో గంట ఎల్లవ్వ, గంట ఎల్లమ్మ, గంట బుచ్చమ్మ, ముగ్గురు కలసి కోహెడ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో తక్కువ రేటుకు కొనుగోలు చేసి.. ఎక్కువ రేటుకు అమ్ముదామని అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం డంపు చేసి పెట్టినారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, కోహెడ ఎస్ఐ తిరుపతి, సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. దీంతో కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.