TG Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Telangana cabinet meeting today: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టం, కేంద్రం నుంచి రావాల్సిన పరిహారం గురించి చర్చించనున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

Spread the love

Related News