మునుగోడు మండల కాంగ్రెస్ గ్రామ శాఖలు రద్దు.

*28 గ్రామ కమిటీల పదవీకాలం పూర్తి – ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు నిర్ణయం

*త్వరలో నూతన కమిటీల ఏర్పాటు – మండల అధ్యక్షులు సైదులు.

ప్రతిపక్షం మునుగోడు అక్టోబర్ 25: మునుగోడు మండల పరిధిలోని 28 గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను రద్దు చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు తెలిపారు.గ్రామ కమిటీల పదవీకాలం పూర్తయినందున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాష్ నేత మార్గదర్శకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నిబద్ధతతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించడం లక్ష్యంగా త్వరలో నూతన గ్రామ శాఖ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News