ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 26: మెదక్ నియోజకవర్గం లోని ఘనపూర్ మెదక్ మండలాల గిరిజన ప్రజాప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీమంత్రి హరీష్ రావును కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు సోమవారం హైదరాబాదులోని హరీష్ రావు ఇంటికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో ఘనంగానించారు ఈ కార్యక్రమంలో గిరిజన సర్పంచులు ఎంపీటీసీలు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అని కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ పార్టీలో పని చేయాలని పార్టీ నాయకులకు చేదోడువాదుడుగా ఉండాలని అయినా అన్నారు ముఖ్యంగా గిరిజనుల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కెసిఆర్ అన్ని. గిరిజన అభివృద్ధికి కేసిఆర్ ఎంతో కృషి చేశాడని వారు తెలిపారు. నియోజకవర్గ మొత్తం గిరిజనులు భారత రాష్ట్ర సమితికి మద్దతుగా ఉండాలని వారు పిలుపునిచ్చారు హరీష్ రావును కలిసిన వారిలో
స్వామి నాయక్, శ్రీనివాస్ నాయక్. రంజిత్ లడ్డు గోపాల్ సుభాష్ సుధాకర్నాయక్ గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.





























