ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : నిర్మల్ జిల్లా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు అఖిల్ రెబల్ శుక్రవారం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుపుతు భారత్ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని తన పదవికి సహకారాన్ని అందిచిన కల్వకుంట్ల తారక రామారావు మాజీ ఐటీ శాఖ మంత్రి కు సోషల్ మీడియా ద్వారా అందించానని పేర్కొన్నారు.
తన రాజకీయ జీవితం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితోనే మొదలైందని చివరి వరకు తన రాజకీయ జీవితం మాజీ మంత్రి అల్లోల తోనేనని ఆయన తెలిపారు. 2009 నుండి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వీరాభిమాని గా పేరు పొందానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విశ్వాసనీయ సమాచారం.