Trending Now

బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 15 : అదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దౌర్జన్యంగా ప్రవర్తించడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడిన బీజేపీ ఆదిలాబాద్ నాయకుల పై రౌడీషీటర్ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మంగళవారం ఆదిలాబాద్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఉత్కంఠ భరితంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా ఎన్నికల ప్రవర్తన నియమావళీని ఉల్లంఘిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాలలోకి చొచ్చుకొని రావడం.. ఇదేమిటని నిలదీసిన వారిపై ఘర్షణలకు దిగడం లాంటిది చేయడం జరిగిందన్నారు. మహిళలు అని కూడా చూడకుండా పరుష పదజాలంతో దురుసుగా వ్యవహరించడం జరిగిందని పేర్కొన్నారు. మహిళా నాయకులతో కలిసి ఆధారాలతో కూడిన రాతపూర్వకమైన ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు ఆయా విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News