ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, జూన్ 4: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 10 వ రౌండ్ ముగిసేసరికి 1,02,854 ఓట్ల ఆదిత్యం కనబరుస్తుండటంతో జీవన్ రెడ్డి తన అనుచర్లతో బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తామని, ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.