వాల్మీకి మహర్షి ఆశయాలు స్ఫూర్తిదాయకం

ధర్మం, సత్యం, నీతి, మానవత్వానికి ప్రతీక వాల్మీకి మహర్షి

-భైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 26: ధర్మం, సత్యం, నీతి, మానవత్వం వంటి ఉన్నత విలువలను సమాజానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం, ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిని కల్గిస్తాయని బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. వాల్మీకి మహర్షి చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి, దేశ సేవకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేటలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భైరి శంకర్ ముదిరాజ్ పార్టీ శ్రేణులతో కలిసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి తన రచనల ద్వారా మానవాళికి విలువైన సందేశాలను అందించారని కొనియాడారు. ధర్మ బద్ధమైన జీవనం, సత్యనిష్ఠ, నీతి, మానవత్వం వంటి సుగుణాల ప్రాధాన్యతను ఆయన జీవితం తెలియజేస్తుందన్నారు. వాల్మీకి మహర్షి బోధనలు సమాజంలో సత్ప్రవర్తనను పెంపొందించి ప్రజలకు సన్మార్గాన్ని చూపుతాయని పేర్కొన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను, వారు అందించిన సందేశాలను నేటి యువత తెలుసుకోవాలని సూచించారు. వారి ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావచ్చన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల నాగరాజు, ప్రశాంత్, ప్రణయ్, భరత్, సాయి, రాకేష్, వివేక్, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News