ప్రతిపక్షం, అక్టోబర్ 27, చండూరు: స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ (IAS), మరియు చండూరు డివిజన్ ఆర్డీవో శ్రీదేవీ కి వినతి పత్రం సమర్పించిన చండూరు మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ సామ సుజాత-యాదవ రెడ్డి. చండూరు మున్సిపాలిటీ పరిధి 3వ వార్డు లకినేనిగూడెంలో స్మశాన వాటిక స్థలం గురించి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించడం జరిగిందని కౌన్సిలర్ సామ సుజాత-యాదవ రెడ్డి తెలిపారు. గ్రామంలో చనిపోయిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, స్థలం లేకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సొంత పొలాలో, రోడ్డు ప్రక్కన అంత్యక్రియలు జరపాలసి వస్తుందని, కావున మాకు సరైన ప్రభుత్వ స్థలాన్ని స్మశాన వాటిక కొరకు కేటాయించి, స్మశాన వాటిక నిర్మాణం చేయాలని వినతిపత్రంలో కోరినట్లుగా ఆయన తెలిపారు.





























