Telangana Police donates to flood victims: తెలంగాణ పోలీసులు తమ పెద్ద మనస్సును చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులను అదుకునేందుకు ముందుకు వచ్చారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు అండగా నిలిచారు. ఈ మేరకు వరద బాధితులకు ఒక్క రోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తమ ఒక్క రోజు వేతనం రూ.11,06,83,571 చెక్‌ను డీజీపీ జితేందర్, ఇతర పోలీసులు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన పోలీసులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.