స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జులై 27: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల మొదటి వారంలో లేదా ఆగస్టు 15న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలను ముద్రించారు.

Spread the love

Related News

Latest News