ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్

ప్రతిపక్షం, జూలై 27: తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసేటప్పుడు కుటుంబ వివరాల సమర్పణలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించడమే ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది.

ఈ సర్టిఫికెట్‌లో ఫ్యామిలీ ఐడీ నంబర్, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, చిరునామా వంటి సమాచారం ఉంటుంది. ఇది కుటుంబానికి అధికారిక గుర్తింపు పత్రంగా ఉపయోగపడనుంది. ఈ సర్టిఫికెట్ కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Spread the love

Related News

Latest News