“ఫోక్సో” చట్టంపై అవగా హనతోనే నష్టాల్ని నివారించుకోవచ్చు.

మెట్టుపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్.

ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) అక్టోబర్ 26: “పోక్సో” చట్టం పై అవగాహన తోనే అనేక నష్టాల్ని నివారించుకోవచ్చని మెట్ పల్లి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం సురక్షిత బచ్ పన్ అభియాన్ స్కీమ్ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లా డుతూ, 18, ఏళ్ల లోపు వయసున్న ప్రతి విద్యార్తిని, విద్యార్థులు పొక్సో చట్టం యొక్క నియమాలు, నిబం దనలు తెలుసుకోవాలని సూచించారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు వారు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గూర్చి రహస్యంగా దాచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి లో “చైల్డ్ హెల్ప్ లైన్ 1098”, కి కూడా ఫిర్యాదు చేయొచ్చ ని సూచించారు. ఈ కార్యక్ర మం లో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, న్యాయవాదులు జేడి సుధాకర్, డా.తుల రాజేందర్, సామ అనిరుద్, బాస రాములు, ప్రధాన ఉపాధ్యాయులు రామా నుజం, ఉపాధ్యాయులు మధుచందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News