ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పిస్తాం.. నియోజకవర్గంలో ఏ గ్రామంలో గుడిసె ఉండకూడదు: ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 27: మెదక్ నియోజకవర్గంలో ప్రతి మండలంలోని గ్రామాలలో గుడిసెలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇస్తామని గుడిసెలు లేని నియోజకవర్గంలో తీర్చిదిద్దడం కోసం సాయి శక్తుల కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.మెదక్ నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి గౌరవప్రదమైన నివాస సదుపాయం కల్పించేందుకు కృషి చేయడమే తన దృఢ సంకల్పమని పేర్కొన్నారు. ఒక్క నిరుపేద కుటుంబం కూడా నివాసం కోసం ఇబ్బందులు పడకుండా, ప్రతి కుటుంబానికి భద్రతతో కూడిన పక్కా ఇల్లు అందించాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.
ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భరోసా, ఆత్మగౌరవం, భద్రతతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరే వరకు తన కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి ఫలాలు అర్హులైన పేదలకు అందేలా కృషి చేస్తూ మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.గుడిసెలు లేని మెదక్.. అభివృద్ధిలో అగ్రగామి మెదక్.. ఇదే తన స్వప్నమని, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు.





























