శివన్నగూడ రిజర్వాయర్ పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి: సీపీఎం నేత నాగార్జున.

*ఫ్లోరిన్ సమస్యకు పరిష్కారం రిజర్వాయర్ తోనే – ప్రభుత్వానికి డిమాండ్.

*నవంబర్ 15-18 నల్గొండలో అఖిలభారత రైతు మహాసభలు.

*పంట నష్టపోయిన రైతులకు పరిహారం, రుణమాఫీ చేయాలి.

ప్రతిపక్షం – మర్రిగూడ, అక్టోబర్ 27:
మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం మర్రిగూడలో నవంబర్ 15 నుండి 18 వరకు జిల్లా కేంద్రంలో జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభల కరపత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.మునుగోడు ప్రాంతంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఫ్లోరిన్ రక్కసిని రూపుమాపాలంటే శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని కోరారు.వర్షాభావం, నీటి కొరతతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని, నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాయకులు రామలింగచారి, లక్ష్మి, భరత్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News