కోరుట్ల,లో అక్రమ నిర్మాణాల తొలగింపు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: మున్సిపల్ కమీషనర్.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 27: జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఫిర్యా దులు, కోర్టు కేసుల నేపథ్యం లో ఎన్‌ఫోర్స్‌మెంట్, టీమ్ లీడర్ ఆదేశాల మేరకు మంగళవారం ఈ తొలగింపు చర్యలు నిర్వహించారు.
కోరుట్ల, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భవనం లోని నిబంధనలకు విరుద్ధ మైన నిర్మాణ భాగాన్ని అధికారులు తొలగించారు. అలాగే అంబేద్కర్ రోడ్డు ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన గోడను కూల్చివేసి ఆక్రమణను తొలగించారు. ఈ చర్యల్లో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొ న్నారు. భవన నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా లేదా సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని కోరుట్ల మున్సిపల్ కమీషనర్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019, ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News