Trending Now

నకిలీ విత్తనాలపై కొరడా..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక నిఘా..

నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలలో పకడ్బందీగా నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టి నిత్య తనఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు లేదా నిలువలు ఉన్నట్లు వాస్తవ సమాచారం ఆధారాలతో సహా ఉంటే వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదు కూడా చేయాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు, లేదా నిల్వ ఉంచినట్లు ఎలాంటి ఆధారిత సమాచారం ఫిర్యాదు వచ్చిన కఠినంగా వ్యవహరించి వారిపై అధికారిక ఉత్తర్వుల ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో వ్యవసాయ రైతులు యువకులు అప్రమాతంగా ఉండి ఎలాంటి అనుమానాలు ఉన్నా ఆధారాలతో సహా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Spread the love

Related News

Latest News