ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయని BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. ‘అయినా నిరాంతరంగా శ్రమించి బూడిదలో నుంచి కూడా బయటకు వచ్చే ఫీనిక్స్ పక్షి తరహాలో పూర్వ వైభవం సంపాదిస్తాం.TRS ఏర్పాటైన 24 ఏళ్ల నుంచి అన్నింటినీ చూశాం. అద్భుతమైన విజయాలు సాధించాం, ఓటములనూ చవిచూశాం.తెలంగాణ రాష్ట్ర సాధన మా పార్టీకి గొప్ప విజయం. 2023లోనూ 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం’ అని అన్నారు.