CM Revanth Reddy Distribution of land allotment documents: రాష్ట్రంలో నిజమైన జర్నలిస్టులకు తప్పకుండా న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామన్నారు. కొంతమంది జర్నలిస్టులు ప్రజా ప్రయోజనాలు కోసం పనిచేయడం లేదని, తమ యజమాని ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది జర్నలిస్టులకు నేను ఇష్టం ఉండకపోవచ్చని, కానీ కనీసం నా కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా అన్నారు.