అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి

ప్రతిపక్షం, అక్టోబర్ 28, ములుగు: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు అప్రమత్తం చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సూచనలు అందిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

Spread the love

Related News

Latest News