– – రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.
– – పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా రక్తదాన శిబిరం.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 28: పోలీస్ అమరవీరుల సంస్మ రణ లో భాగంగా పోలీస్ అమరవీరుల త్యాగలను స్మరిస్తూ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ,అశోక్ కుమార్ హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ సర్కిళ్ల సి.ఐ, లు ఎస్.ఐ, మరియు పోలీస్ సిబ్బంది,యువత స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ సంద ర్భంగా ఎస్పీ, మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మ రణలో భాగంగా ప్రతీ సంవ త్సరం పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరాకు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా, నిత్యం గుర్తు చేసుకోవడానికి జిల్లాలో పోలీస్ అమరవీరు ల సంస్మరణ కార్యక్రమాల లో భాగంగా అనేక కార్యక్ర మాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోలీసులు చేపడుతున్న ఇట్టి కార్యక్రమాలకు యువత నుండి అనూహ్య స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలిపారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పోలీస్ అదికారులను అభినందించారు.
ఎల్నినో, ప్రభావం నేపథ్యంలో నీరు, విద్యుత్,ను పొదుపుగా వినియోగించాలి: ఎల్నినో ప్రభావం నేపథ్యం లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, అధిక ఉష్ణోగ్రత లు, వర్షపాతంలో హెచ్చుత గ్గులు చోటుచేసుకునే అవకాశాల దృష్ట్యా ప్రజలు నీరు, విద్యుత్ వినియోగం లో పొదుపు పాటించాలని ఎస్పీ, సూచించారు. రోజు వారీ జీవితంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నీటి వృథాను, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ నీరు, విద్యుత్ పొదుపును జీవితంలో భాగంగా చేసు కోవాలని పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతా యుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచిం చారు. ఈ కార్యక్ర మంలో డిఎస్పీ, లు పురుషోత్తం రెడ్డి, DMHO, సుజాత, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులు,ఇన్స్పెక్టర్ సుధాకర్,కరుణాకర్,రాజ్ కుమార్, తిరుపతి, వేణు, సైదులు , మరియు ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, యువత, పాల్గొన్నారు.

































