- బిఎల్ ఏ -2 కు ప్రత్యేకంగా కేటాయించిన ఇన్చార్జిలు కీలకంగా వ్యవహరించాలి.
- క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి:డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి
ప్రతిపక్షం, జులై 29,వనపర్తి ప్రతినిధి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ప్రక్రియ లో సమయం తక్కువగా ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను పకడ్బందీగా పూరించాలని బిఎల్ఎ -2 ప్రతినిధులకు 100% పూర్తి చేయాలని డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి పేర్కొన్నారు.బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఎల్ఎ -2 లతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డిసిసి చీఫ్ శివ సేన రెడ్డి లు హాజరై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఓట్లను తీసేసే కుట్ర బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయని, వారు చేసిన కుట్టలను తిప్పుకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ లో ఉన్న బిఎల్ఏ -2, నాయకులు,కార్యకర్త లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.తక్కువ సమయం ఉన్నందున ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అత్యవసర సమావేశా లు ఏర్పాటు చేసుకొని సమీక్షిస్తూ ముందుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నికార్సేనా ఎస్సీ, ఎస్టి, బిసి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… పార్టీ కోసం ఐక్యతగా పనిచేసినప్పుడే పార్టీ గెలుపు ఆస్కారం ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న బిఎల్ఏ -2 లు, ఇంచార్జ్ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని, పనిచేసిన వారికి సమచితస్థానం కల్పిస్తుందని తెలిపారు. తక్కువ సమయం ఉన్నందున పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో సమన్వయమై సర్ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోళ్ల వెంకటేష్, శరవంద, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, మండలాధ్యక్షులు నక్క రవి కిరణ్, బిఎల్ఏ-2, వివిధ మండలాల అధ్యక్షులు,కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

















