ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 28 : పట్టణానికి చెందిన శబరిమలై కి పాదయాత్రగా బయల్దేరి వెళ్ళారు. పట్టణానికి చెందిన ఉప్పల శ్రీనివాస్, సంగమేశ్వర్, చందు, వర్షిత్, రమేష్, సాయి కృష్ణ, సురేష్, శివ, రాందీప్ అయ్యప్ప మాల ధరించగా, బుధవారం అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టుకొని పాదయాత్ర గా వెళ్ళారు. ఆలయం నుంచి మాయా గార్డెన్స్ వరకు కొనసాగిన స్వాముల పాదయాత్రకు ఆయా చోట్ల పలువురు వ్యాపారులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాములు శబరిమలై వరకు 1,600 కి. మీల మేరా పాదయాత్ర చేయనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఆలయ సేవకులు, గురు స్వామి వైద్య రాజు, ఆలయ కమిటీ బాధ్యులు గంగ లక్ష్మీపతి, వీర్ కుమార్, చక్రపాణి, పార్థినాత్, కొండ శ్రీను, రాజన్, చిన్న రాజు, రమేష్, సురేష్ పాల్గొన్నారు.






























